Saturday, April 27, 2024
- Advertisement -

పాలను ఫ్రిజ్ లో పెట్టవచ్చా… పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- Advertisement -

మన రోజువారి జీవితంలో ఎంతో అవసరమయ్యే వాటిలో పాలు ఒకటి. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే రోజు గడవదు. కనుక పాలు మన నిత్యావసరాలలో ఎంతో ముఖ్యమైనది. అయితే చాలామంది పాలను కొన్ని రోజులకు సరిపడా ఒకేసారి తెచ్చుకుని ఫ్రిజ్లో పెట్టుకుని తాగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు ఫ్రిజ్లో నిల్వ చేసిన పాలను తాగకూడదని చెబుతుంటారు. అయితే పాలను ఫ్రిజ్ లో పెట్టవచ్చా? పెడితే ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు? నిల్వ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఒకసారి పాల ప్యాకెట్లను తెచ్చిన తరువాత నాలుగు రోజుల నుంచి వారం రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవచ్చు. అదే తెరవని ప్యాకెట్లను అయితే నెలల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. అయితే పాలలోని నాణ్యత కోల్పోకుండా ఉండాలంటే పాలను కేవలం నెలరోజుల వ్యవధిలో వాడుకోవాలి. అయితే పాల ప్యాకెట్లను ఫ్రిజ్లో ఉంచే ముందు పాత్ర కొద్దిగా ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పాలు గడ్డకట్టినప్పుడు వాటి పరిమాణం పెరుగుతుంది కనుక కొద్దిగా ఖాళీ ఉండాలి.

పాలను రిఫ్రిజిరేటర్ లో పెట్టే ముందు కంటైనర్లోకి ఎలాంటి గాలి చొరబడకుండా గట్టిగా బిగించి ఉండాలి. ఒకవేళ మూత లేకుండా పెట్టడం వల్ల పాలు ఇతర వాసనలను గ్రహించి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పాలను ఐస్ క్యూబ్ లో పోసి గడ్డకట్టించి పెట్టడం ఎంతో ఉత్తమమైన మార్గం. మనకు అవసరమైనప్పుడు ఈ ఐస్ క్యూబ్ లను కరిగించుకొని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఈ విధంగా ఘనీభవించి కరిగించిన పాలను ఏదైనా వంటలు , స్మూతీలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ ఈ పాలను తాగటం కొంతవరకు ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -