Tuesday, May 14, 2024
- Advertisement -

నంది అవార్డుల‌పై స్పందించిన బాల‌య్య‌..

- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నందీ అవార్డుల వివాదాస్ప‌దం కొన‌సాగుతోంది. ఒక వ‌ర్గం వారికె నంది అవార్డులు కేటాయించార‌ని అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఇది సినీ ప‌రిశ్ర‌మ‌ను రెండుగా విభ‌జించింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికి ఈ వివాదం ర‌గులుతూనె ఉంది. తాజా వివాదంపై బాల‌య్య స్పందించారు.

ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావ‌డాన్ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. తాను న‌టించిన‌ సినిమాకు నంది రావ‌డం ప‌ట్ల బాల‌కృష్ణ స్పందించారు. నంది అవార్డుల విష‌యంలో ఎటువంటి వివాదాలు వ‌ద్దని అన్నారు. స‌మష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజ‌య‌వంతం అయింద‌ని తెలిపారు.

అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే తాను న‌టించిన సినిమాకు 9 అవార్డులు వ‌చ్చాయని అన్నారు. మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో చూపించిన సినిమా లెజెండ్ అని వ్యాఖ్యానించారు. నంది అవార్డులు ఎంపిక చేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లని అన్నారు. సాధించిన వారంద‌రికీ అభినంద‌న‌లని చెప్పుకొచ్చారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని వ్యాఖ్యానించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -