Sunday, April 28, 2024
- Advertisement -

33వ ప‌డిలోకి అడుగు పెట్టిన న‌య‌న‌తార‌

- Advertisement -

ద‌క్షిణ సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌య‌న‌తార టాప్ హీరోయిన్‌. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో అల‌రించిన న‌య‌న్ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. అయితే త‌మిళంలో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల ఆమె సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మొదట మలయాళం సినిమాతో సినీ అరంగేట్రం చేసింది. ఈ సుంద‌రాంగి అతి తక్కువ రోజుల్లోనే ద‌క్షిణ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ స్థాయికి చేరింది. ప్ర‌స్తుతం కొంత హీరోయిన్ల తాకిడిలోనూ ఆమె త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. ఆమెతో పాటు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన త్రిష‌, ఆసిన్‌, ఇలియానా వంటి వారు సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌వుతున్నా ఆమె కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత పోటీ స‌మ‌యంలో కూడా ఏడాదికి నాలుగైదు సినిమాల్లో న‌టిస్తోంది. శ్రీరామ‌రాజ్యం సినిమా ఆమె అత్యంత భ‌క్తితో చేసింది. మాంసాహారం మానేసి నిత్య‌తో ఆమె చేయ‌డంతో అభిమానులు ఫిదా అయ్యారు. అలాంటి వ్య‌క్తిత్వంతో న‌టిస్తున్న ఆమెకు ఆద్య న్యూస్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది. ఈరోజు (న‌వంబ‌ర్ 18న‌) న‌య‌న‌తార పుట్టిన రోజు. 32వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది.

న‌ట‌న‌లో మారుస్తూ కొంటె చూపులు, చిలిపి న‌వ్వుల‌తో అభిమానుల‌ను ఆమె అల‌రించింది. అదుర్స్‌, శ్రీరామ‌రాజ్యం, రాజారాణి, తుల‌సి, సింహా, గ్రీకువీరుడు, ల‌క్ష్మీ, బాస్‌, యోగి, దుబాయ్‌శ్రీను త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది. అయితే ఆమె ప్రేమ వ్య‌వ‌హారాలు మాత్రం వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆమె పెళ్లిపై కూడా పుకార్లు షికార్లు చేశాయి. అవ‌న్నీ ప‌క్క‌కు నెట్టి త‌న ప‌ని తాను చేసుకుపోతోంది.

ఉత్త‌మ న‌టిగా ఎన్నో అవార్డులు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా అందుకుంది. అంతే కాకుండా తమిళ ప్రభుత్వం ప్రకటించే కలైమామని పురస్కారాన్ని కూడా పొందింది. ప్ర‌స్తుతం న‌య‌న్ తెలుగులోల్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరాలో నటిస్తోంది. తమిళ్‌లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒక సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇకపోతే నయన్ తన పుట్టినరోజును బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలసి జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు ప‌లువురు నుంచి వెల్లువెత్తాయి. త‌మిళ‌నాడులో ఒక‌రోజు ఆమె చిత్రంతో కూడిన భారీ కేక్‌ను న‌య‌న‌తార‌తో క‌ట్ చేయించి సంబ‌రాలు చేసుకున్నారు. త‌మిళ‌, మ‌ళ‌యాలం, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి విషెస్ అందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -