Saturday, May 4, 2024
- Advertisement -

బ్రేకింగ్ : నారా రోహిత్ కి విలన్ గా నందమూరి హీరో

- Advertisement -

నారా వారి అబ్బాయి నారా రోహిత్ తన సినిమాలతో ఎదో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాడు అని బాగా పేరుంది. ప్రస్తుతం తుంటరి అంటూ కొత్త సినిమా తీస్తున్న మనోడు, పవన్ సాధినేని దర్సకత్వం లో సావిత్రి సినిమా కి సిద్దం అవుతున్నాడు.

ఈ మధ్య లౌఖ్యం ఫేం శ్రీవాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ప్రదీప్ కథ చెప్పడం తో అది ఓకే చేసిన నార రోహిత్ ఈ సినిమా ని మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నాడు. ఈ సినిమా వారాహి చలన చిత్రం బ్యానర్ మీద ఉంటుంది అని అంటున్నారు. కథ ఓకే చెయ్యడం తో పాటు ఈ సినిమా ” రాజా చెయ్యి వేస్తే’ అనే టైటిల్ ని ఖరారు కూడా చేసారు. ఈ సినిమా కి మెయిన్ విలన్ గా నందమూరి మాజీ హీరో తారకరత్న ని ఓకే చేసారు. ఆ మధ్య అమరావతి సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన తారక రత్న కి మంచి అప్ప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కి కూడా విలన్ పాత్ర కి ఒకే అన్న తారకరత్న నారా హీరో తో ఫైట్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమా  కాకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘పండగల వచ్చాడు’, ‘జో అచ్యుతానంద’ మరియు ‘వీరుడు’ అనే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు నారా రోహిత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -