Monday, May 13, 2024
- Advertisement -

వినాయకచవితి రోజున నందమూరి అభిమానులకు ఫుల్ ఖుష్!

- Advertisement -

ఇప్పటికే ఈ ఏడాది నందమూరి నామ సంవత్సరం అనే నానుడి ఒకటి ప్రచారంలో ఉంది. ఏడాది ప్రారంభంలోనే కల్యాణ్ రామ్ పటాస్ తో ఒక మరపురాని విజయాన్ని సొంతం చేసుకొన్నాడు.

దీంతో ఇది నందమూరి అభిమానులకు ఆనందదాయకమైన సంవత్సరంగా ప్రారంభం అయ్యింది. ఇక కల్యాణ్ రామ్ ఆ విధంగాహిట్ కొట్టగా టెంపర్ రిలీజ్ సమయంలోనే ఇది నందమూరి నామ సంవత్సరం అనే ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగా తారక్ కూడా టెంపర్ తో తన టెంపర్ చూపించాడు.

అన్నదమ్ములు ఇలా హిట్లు కొట్టినా.. బాబాయ్ మాత్రం నిరాశపరిచాడు. నందమూరి నామ సంవత్సరంలో ఆయన ప్లాఫ్ నే చవి చూశాడు. అయితే అప్పుడే అభిమానుల జోష్ ఏమీ తగ్గిపోలేదు. ఇప్పడు వాళ్లను మరింతగా ఆనందపెట్టడానికి హీరోలు వచ్చేస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా వారు అభిమానుల ముందుకు వస్తున్నారు. వినాయకచవితి రోజున నందమూరి సినిమాలకు సంబంధించి రెండు అప్ డేట్స్ ఉన్నాయి.

ఆ రోజున తారక్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ లుక్ విడుదల కానుండగా… కల్యాణ్ రామ్ సినిమా ‘షేర్’ కు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. మరి ఈ రోజుల్లో ఫస్ట్ లుక్ లు.. టీజర్ల విడుదలలు అభిమానులకు ఆనందదాయకమైన విషయాలుగా మారాయి. ఈ నేపథ్యంలో నందమూరి హీరోలకు వినాయకచవితి సందర్భంగా అలాంటి రెండు ఆనందదాయకమైన విషయాలు కలిసి రావడం విశేషమే! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -