Saturday, May 18, 2024
- Advertisement -

అల్లు అరవింద్ వెంట పడుతున్న తమిళ నిర్మాతలు!

- Advertisement -

గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆఫీసు చు ట్టూ వాలిపోయారు తమిళ నిర్మాతలు. అల్లు అరవింద్ తో తమకున్న పాత పరిచయాలను ఉపయోగించుకొంటూ వారు తీవ్ర లాబీయింగ్ చేస్తున్నారు.

ఇదంతా ఒకే ఒక కారణం చేత జరుగుతోంది. ఒక సినిమా హక్కులను సంపాదించుకోవడానికి వారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అన్నీ “భలే బలే మగాడివోయ్” సినిమా విషయంలో జరుగుతున్నాయి. ఈ సినిమా రీమేక్ హక్కులను సంపాదించుకోవడానికి తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నారు.  నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

మారుతి గత సినిమాలకు భిన్నంగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్ బంపర్ హిట్ అయ్యింది. మరి తెలుగు సినిమాలు హిట్ అయితే.. వాటి రీమేక్ లకు ఇప్పుడు క్రేజ్ చాలా పెరిగిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలోనే అనేక తెలుగు సినిమాల హక్కుల కోసం పక్క ఇండస్ట్రీల వాళ్లు పోటీలు పడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు భలేభలే మగాడివోయ్ సినిమా రీమేక్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 

దీంతో అల్లు అరవింద్ చుట్టూ.. అనేక మంది తంబీలు తిరుగుతున్నారు. ఈ ప్రొడ్యూసర్ తో తమ గత పరిచయాలను ఉపయోగించుకొని.. ఆయన తాజా సినిమా హక్కులను సంపాదించుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాల్లో ఎవరు విజయవంతం అవుతారో.. ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను సొంతంచేసుకొంటారో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -