Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మోక్ష‌జ్ఞ

- Advertisement -

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రారంభం అయింది ఎన్టీఆర్ బ‌యోపిక్‌.అయితే ద‌ర్శ‌కుడి తేజ‌కి బాల‌కృష్ణకు మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డంతో బ‌యోపిక్ నుండి త‌ప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు తేజ‌.అయితే ఈ సినిమాలోకి వ‌చ్చి చేరాడు క్రిష్.ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోకి క్రిష్ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత సినిమా రూపురేఖ‌లు మారిపోయాయి.సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు యాక్ట్ చేస్తార‌ని మొద‌టి నుండి వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో బాల‌కృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కనిపిస్తేనే నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతారని బాలకృష్ణతో క్రిష్ చెప్పారట.బాల‌కృష్ణ కూడా ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారని స‌మాచారం.అందుకు మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లాడని అంటున్నారు.మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉంటాడు ,ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కాస్త సన్నబడితే బాగుంటుందని క్రిష్ సూచించాడని చెబుతున్నారు.దీంతో మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లాడని తెలుస్తుంది.మ‌రి దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -