Friday, May 3, 2024
- Advertisement -

టీజర్ తో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ‘అక్షర’

- Advertisement -

తమిళ్ బ్యూటీ నందిత శ్వేత ఎప్పటినుంచో తన కెరీర్ లో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘7’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈమె దర్శకుడు బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో ‘అక్షర’ అనే సస్పెన్స్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ అజయ్ గోష్, పిండి తాతాజీ గా తనని తాను పరిచయం చేసుకోవడం తో మొదలవుతుంది. తన ముగ్గురు స్నేహితులు అయిన షకలక శంకర్, మధునందన్,సత్యాలతో పిండి తాతాజీ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాడు.

అప్పుడే వారి జీవితాల్లోకి అక్షర (నందిత శ్వేతా) అనే ఒక టీచరమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో వారి జీవితాలు ఎలా మారాయి? వారు అక్షర ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? చివరికి ఏం జరగనుంది? అనేది సినిమా కథగా తెలుస్తోంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. అహితేజ బెల్లంకొండ మరియు సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -