Monday, May 13, 2024
- Advertisement -

టీమిండియా షాక్‌…గాయ‌ప‌డ్డ మ‌రో ఆల్‌రౌండ‌ర్‌

- Advertisement -

టీమిండియాను గాయాల బెడ‌ద వీడ‌టంలేదు. ఇప్పటికే భారత స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేతి వేలి గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగగా, భువనేశ్వర్‌ కుమార్‌ కండరాల గాయంతో బాధడపడుతున్నాడు. తాజాగా మ‌రోఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ గాయ‌ప‌డ్డారు. ఆప్ఘ‌న్ తో జ‌రిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానె ఉంది.

శనివారం అఫ్గానిస్తాన్‌తో సౌతాంప్టన్‌లో మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా విజయ్‌ శంకర్‌కు గాయమైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన యార్కర్‌కు విజయ్‌ శంకర్‌ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో విజయ్‌ శంకర్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు.

కొద్దిసేప‌టి త‌రువాత కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడ‌ర‌ని చెబుతున్నారు. ఈ విషయాన్ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీ) ఇంకా అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్ ఆడ‌టానికి ఇంకా 36 గంట‌ల పాటు స‌మ‌యం ఉన్నందున‌.. ఈ లోగా కోలుకునే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆప్ఘ‌న్ మ్యాచ్‌కు దూరం అయితే అత‌ని స్థానంలో పంత్‌కు చోటు ద‌క్కుతుందా లేదా అన్న‌ది అనుమానంగానె ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -