కల్కి Kalki 2898 AD సీక్వెల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే స్టైలిస్ట్ అమృతా రామ్ ఈ విషయాన్ని వెల్లడించగా, ఇప్పుడు స్వయంగా అమితాబ్ బచ్చన్ ఈ వార్తను ధృవీకరించారు.
బిగ్ బీ తన టంబ్లర్ అకౌంట్ ద్వారా షూటింగ్ ప్రారంభమైందని, తాను కూడా సీక్వెల్ చిత్రీకరణలో తిరిగి పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో, చాలా మంది అభిమానులు ఆయన ముంబైలోని నివాసం ‘జల్సా’ వద్దకు వచ్చారని తెలిపారు. కానీ తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నానని స్పష్టం చేస్తూ, జల్సా బయట అభిమానులు గుమికూడిన ఫోటోలు కూడా షేర్ చేశారు.
ఆదివారం సెట్స్‌లో కమల్ హాసన్‌ను కలిసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు పంచుకుంటూ, 1985లో వచ్చిన Geraftaar చిత్రంలో కలిసి పనిచేసిన రోజులను స్మరించుకున్నారు. కల్కి 2 పనులు ప్రారంభమయ్యాయి… ప్రతి ఆదివారం మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను… వచ్చే ఆదివారం తప్పకుండా మీతో ఉంటానని ఆశిస్తున్నాను అని బిగ్ బీ రాశారు. ఈ చిత్రంలో ఆయన అశ్వత్థామ పాత్రను మళ్లీ పోషిస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన బీటీఎస్ ఫోటోలను కూడా పంచుకున్నారు.
