నాని ‘దసరా’ నుంచి మరో పాట.. ఎప్పుడంటే..?

Nani Dasara Third Song Will Be Out On March 8th
Nani Dasara Third Song Will Be Out On March 8th

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దసరా’. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈనెల 30న విడుదల కానుంది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, నాని మాస్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇపుడు సినిమాలోని మూడో పాటను ఈనెల 8వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘చమ్కీల అంగీలేసి’ అంటూ సాగే పెళ్లి పాటలో నాని, కీర్తి సురేశ్ స్కూటర్‌‌పై వెళ్తూ, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోను విడుదల చేశారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.