Friday, April 26, 2024
- Advertisement -

అనిరుద్ పై అసంతృప్తి గా ఉన్న నాని

- Advertisement -

అ ఆ సినిమా తో తెలుగు లో కి ఎంటర్ అవ్వాల్సిన అనిరుద్ కాస్త లేట్ గా అజ్ఞాతవాసి సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో ని సంగీత ప్రియులని పలకరించాడు. మొదటి సినిమా తో నే ఎంతో మంది సంగీత ప్రియులని మెప్పించిన అనిరుద్ ఆ తర్వాత కొంచెం గాప్ తీసుకొని నాని నటించిన జెర్సీ కి పని చేశారు. అయితే ఈ సినిమా తో కూడా అనిరుద్ అందరినీ మెప్పించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే జెర్సీ ఆడియో అందరూ హిట్ అని చెప్పుకున్నా సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం నాని కి, ఆ సినిమా దర్శకుడికి వెళ్ళిపోయింది. ఎంతో కష్టపడి సినిమా ని నెక్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లిన అనిరుద్ కి నిరాశే మిగిలింది.

అయితే ఇప్పుడు అనిరుద్ మళ్ళీ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా కి అనిరుద్ ఎలాగైనా మంచి ట్యూన్స్ ఇచ్చి సక్సెస్ లో తనకి కూడా క్రెడిట్ తీసుకోవాలనే తపన తో ఉన్నాడు. జెర్సీ కన్నా మంచి ఆడియో ఆల్బమ్ ఇవ్వాలి అనే ఆలోచన తో టైం కి ట్యూన్స్ ఇవ్వకుండా లేట్ చేస్తున్నాడట అనిరుద్. డైరెక్టర్ కి ట్యూన్ నచ్చినా ఇంకొంత సమయం తీసుకొని ఇంకా మెరుగైన బాణీలని ఇస్తా అని చెప్పి కాస్త ఆలస్యం చేస్తున్నాడట.

ఇదే విషయమై నాని, మరియు సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కొంచెం అసంతృప్తి గా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -