Monday, April 29, 2024
- Advertisement -

స‌ఫారీల‌పై కీవీస్ అద్భుత విజ‌యం….వరల్డ్‌ కప్‌ నుంచి ఔట్‌

- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌ఫారీల‌కు అదృష్టం క‌ల‌సి రావడంలేదు. వ‌రుస ఓట‌ముల‌తో సౌతాఫ్రికా జ‌ట్టు కుదేల‌య్యింది. సెమీస్‌కు వెల్లే దారులు పూర్తిగా మూసుకుపోవ‌డంతో ఇంటి దారి ప‌ట్ట‌నుంది. త‌జాగా బర్మింగ్‌హామ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో కివీస్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో ఒక ఓవర్‌ను తగ్గించారు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. డసెన్‌ (64 బంతుల్లో 67 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆమ్లా (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హషీం ఆమ్లా (55), మార్కరమ్(38), డుసెన్ (67-నాటౌట్), డేవిడ్ మిల్లర్ (36) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమికి దగ్గరవుతున్నట్టు కనిపించినప్పటికీ కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో పాతుకుపోయి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. 138 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌‌తో అజేయంగా 106 పరుగులు చేశాడు. గ్రాండ్‌హోమ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు.

అనంతరం న్యూజిలాండ్‌ 48.3 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విలియమ్సన్‌ (138 బంతుల్లో 106 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో చెలరేగగా, గ్రాండ్‌హోమ్‌ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన కివీస్ ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మ‌రో సారి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -