న్యాచురల్ స్టార్ నాని మంచి జొష్‌లో ఉన్నాడు.తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్న నాని అటు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అక్కినేని నాగార్జున తో కలిసి ‘దేవదాస్’ అనే మల్టిస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు జెర్సీ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ‘మళ్ళీ రావా’ తో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు.
జెర్సీ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా నాని డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హెల్మెట్.. బ్యాట్.. లెగ్ ప్యాడ్స్ అన్నీ చూపించారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చెల్లెలు హీరోయిన్‌గా పరిచిమవుతుంది.
