Friday, May 3, 2024
- Advertisement -

నాని ‘ఎంసీఏ’ మూవీ ఫస్ట్ లుక్ అదిరింది

- Advertisement -

నేచురల్ స్టార్ నాని.. దీపావళి రావడంతో అభిమానులకు మంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం నాని వరస హిట్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటివలే నాని నిన్ను కోరి సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో హిట్ కొట్టాడానికి వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను నాని ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తూ ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ.. మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ’ విషెష్ తెలియజేశారు. ఇక ఫస్ట్ లుక్ విషయంకు వస్తే.. ‘ఎంసీఏ’ మూవీ టైటిల్‌కి తగ్గట్లే మిడిల్ క్లాస్ అబ్బాయిలా లుంగీ ఎక్కుపెట్టి.. చేతిలో పాల పాకెట్లను పట్టుకుని నవ్వులు చిందుస్తూ వీధిలో నడుచుకుంటూ వస్తున్న లుక్ చాలా నేచురల్‌గా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

దేవి పాటలు సినిమాకి హైలేట్ కానున్నాయట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతలో నాని వేసుకున్నట్లే అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక మరో వైపు నాని.. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో కృష్ణార్జున యుద్ధం అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -