Saturday, May 11, 2024
- Advertisement -

దీపావళికి అలా ఎగిరివెళ్లి వస్తారా..

- Advertisement -

దీపావళి హాలీడేస్ కు పిల్లలు అక్కడకు తీసుకెళ్లు ఇక్కడికి తీసుకెళ్లు అంటూ ఉంటారు కదా. మీకు గనుక కుదిరితే సరదగా ‘జాయ్‌రైడ్‌’కు వెళ్లొచ్చు కదా.
ఇంతకీ ఈ జాయ్ రైడ్ ఏంటనే కదా మీ డౌట్ . అందుల్లోకే వస్తున్నా.. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని హెలీప్యాడ్‌ నుంచి
హెలీకాప్టర్‌ రైడ్‌ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రైడ్ ద్వారా.. నగర అందాలను గగనం నుంచి ఇంచక్కా తిలకించవచ్చు.
ఇందుకుగాను టిక్కెట్‌ రేటును 2,495లుగా నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్‌, చార్మినార్‌, బిర్లా మందిర్‌, బుద్ధ విగ్రహం, సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, నాంపల్లి రైల్వేస్టేషన్‌, ఎల్‌బీస్టేడియం ఇలా సిగ్నళ్ల దగ్గర ఆగే అవసరం లేకుండా.. గగనం నుంచి నగరాన్ని ఈజీగా తిలకించవచ్చు.ఈ అమౌంట్ ఏమాత్రం పెద్ద మొత్తం కాదు. పెద్ద పెద్ద మాల్స్ కు వెళ్లి వేలకు వేలు తగలేసుకునే బదులు జాయ్ రైడ్ కు వెళ్లడం బెటర్ .

జాయ్ రైడ్ స్పెషాలిటీస్ :
* ఓ జంట మొత్తం ప్రయాణించడానికి 10,999/- మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
* 5 మందితో గోల్కొండ కోటను…. ఆకాశం నుంచి వాచ్ చేస్తే 15,000లు చెల్లించాలి.
* జస్ట్ అరగంట అద్దెకు తీసుకొని హెలీకాప్టర్‌లో ప్రత్యేకంగా ఎక్కడికైనా 5 మంది వెళ్లేందుకైతే 49,000లు చెల్లించాలి.
* టిక్కెట్లను ఆన్‌లైన్లోనే అందుబాటులో ఉంచారు మన కేసీఆర్ సారు. ముందుగా బుక్‌ చేసుకుని సరైన సమయానికి వచ్చి సమయం వృథా కాకుండా..

హెలీకాప్టర్‌లో విహరించవచ్చునని నిర్వాహకులు ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఇంకా ఎలాంటి సందేహాలున్నా.. www.helitaxii.com వెబ్‌సైట్లో ఆన్‌లైన్లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -