Saturday, April 20, 2024
- Advertisement -

నాని ఇచ్చిన దెబ్బకు.. కోలుకోలేని పరిస్థిలో పడ్డ బన్నీ

- Advertisement -

డీజే మూవీ అసలే కష్టం మీద పరిగెడుతోంది. మొదటి వారి మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ.. తర్వాత సినిమాకు అదే రెంజ్ లో కలెక్షన్స్ రాలేకపోయాయి. తొలి నాలుగు వారాళ్లో 70 శాతం దాకా బయ్యర్ల పెట్టుబడులు రికవరీ కావడంతో.. నష్టాలు అనుకున్న రెంజ్ లో ఉండవని తెలిపోయింది. మొదటి వారం కలెక్షన్స్ చూసి.. బయ్యర్లు లాభాలు కూడా ఆశించారు. కానీ ఆ తర్వాత వారి ఆలోచన మారింది. పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తే చాలు అనుకున్నారు. అయితే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ జోన్లోకి ఉన్నారు కానీ.. కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు. సెకండ్ వీకెండ్లో ఓ మోస్తరుగా ఉన్న వసూళ్లు తర్వాత బాగా డ్రాప్ అయ్యాయి. దీనికి తోడు నాని మూవీ నిన్ను కోరి.. మూవీ మొదటి రోజు మంచి టాక్ తో మొదలు అయింది. దాంతో అల్లు అర్జున్ సినిమాకి పెద్ద దెబ్బ పడింది. తెలుగు రాష్ట్రాల్లో డీజే మూవీ ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది. డీజేతో పోలిస్తే.. ‘అమీతుమీ’ మూవీ పరిస్థితే మెరుగ్గా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో ‘డీజే’ను ‘నిన్ను కోరి’ కొట్టిన దెబ్బ పెద్దది. 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప హిట్ కేటగిరిలోకి చేరని పరిస్థితి ‘డీజే’ది. కానీ ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లను కూడా అందుకోదని స్పష్టమైపోయింది. 1.2-1.3 మిలియన్ డాలర్ల మధ్య ‘డీజే’ ఫైనల్ కలెక్షన్లు ఉంటాయని అంచనా. బయ్యర్ కు రూ.4 కోట్ల దాకా నష్టమని అంటున్నారు. సెకండ్ వీకెండ్లో బన్నీతో పాటు ‘డీజే’ టీం అంతా వచ్చి ప్రమోట్ చేసినా ఫలితం లేకపోయింది. మూడో వారాంతం వసూళ్లపై పెట్టుకున్న ఆశల్ని ‘నిన్ను కోరి’ తుంచేసింది. నాని సినిమా దెబ్బకు ‘డీజే’ వాషౌట్ అయిపోయింది. యుఎస్ తెలుగు బాక్స్ ఆఫీస్ ను నాను ఆక్రమించేశాదు. ఇప్పుడు నిన్ను కోరి మూవీ అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -