Wednesday, May 22, 2024
- Advertisement -

రాబోయే ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ప్లీన‌రే సాక్ష్య‌మా…?

- Advertisement -

రెండు రోజుల పాటు ఏపీ రాజధానిలో జరిగిన వైసీపీ ప్లీనరీకి జ‌నాలు పోటెత్తారు.అప్పుడే ఎన్నిక వాతార‌ణం నెల‌కొన్న విధంగా ఉంది. ప్లీనరీ ప్రాంగణం కిక్కిరిసిపోవడమే కాకుండా కృష్ణా – గుంటూరు జిల్లాల రోడ్లు.. హైవేలు అన్నీ కిక్కిరిసిపోయాయి. జగన్ పార్టీ ప్లీనరీ విజయవంతం కావడంతో పాలక టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టి ఆ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు.

ముఖ్యంగా జగన్ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది తొమ్మిది పాయింట్లలో చెప్పడం అవన్నీ ప్రజలను విశేషంగా ఆకట్టుుకోవడంతో టీడీపీలో భయం కనిపిస్తోంది. ప్రధాన నేతల నుంచి మూలనున్న నేతల వరకు అంతా బయటకొచ్చి వైసీపీపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు.

ముఖ్యంగా ఎన్నడూ లేనట్లుగా ఈ ప్లీనరీ భారీ సక్సెస్ కావడం కూడా టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 వేల నుంచి 30 వేల మంది ఈ ప్లీనరీకి వస్తారనుకుని ఏర్పాట్లు చేయగా ఏకంగా 75 వేలమంది వచ్చారని.. తొలుత 25 వేల మందికోసం వండిన భోజనాలు ఏమూలకూ సరిపోలేదని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి.

జనాలను తరలించేందుకు ఒక్క వాహనం కూడా పెట్టకుండానే 75 వేల మంది తరలివచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ప్లీనరీ జరిగిన రెండు రోజుల్లోనే రాష్ర్టంలో రాజకీయం ఒక్కసారిగా స్పష్టతకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘ‌న‌విజంయం సాధించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -