Saturday, May 4, 2024
- Advertisement -

పుకార్ల‌పై మీ క్రియేటివిటీకో దండం

- Advertisement -
  • కారు ప్ర‌మాదంపై క్లారిటీ ఇచ్చిన నానికృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ వెళ్లి వ‌స్తూ ఉదయం 4 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లో కారు ప్ర‌మాదానికి గురైంది. వెంట‌నే నాని వేరే కారులో వెళ్లిపోగా డ్రైవర్ కారుతో పాటే ఉన్నాడు. డ్రైవ్ చేస్తూ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. స్వ‌ల్ప గాయాల‌తో నాని క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఊపిరి పీల్చుకుంది. హిట్ సినిమాలు తీసే న‌టుడుకు ఏం కాలేద‌ని ఆనందంలో ఉన్నారు.

అయితే ఈ ప్ర‌మాదంపై విభిన్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. పుకార్లు కూడా వ‌చ్చేశాయి. తొలుత నాని కారు న‌డిపాడ‌ని.. ప్ర‌మాదానికి గురి కావ‌డంతో వెంట‌నే డ్రైవ‌ర్‌ను పిలిపించుకొని వెళ్లిపోయాడ‌ని ప‌లు మీడియాల్లో వ‌చ్చింది. నాని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని, ఆస్ప‌త్రి వివ‌రాలు తెలియ‌డం లేద‌ని.. ఘ‌ట‌న జ‌రిగి ప‌ది గంట‌ల‌యినా విష‌యం బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం త‌దిత‌ర ఏదేదో క‌ల్పించి వార్త‌లు రాసేశారు. అయితే వీటిపై నాని స్పందించారు. ఓ మీడియా ట్వీట్‌కు ఆయ‌న స్పందించి బ‌దులిచ్చారు.

`డ్రైవ‌ర్ కూడా మ‌నిషే! 18 గంట‌లు ప‌ని చేశారంటే ఎవ‌రైనా అల‌సిపోతారు. దీనికి డ్రైవ‌ర్‌ను నిందించ‌డం స‌రికాదు. మీ క్రియేటివిటీ ఒక దండం` అని వ్యంగ్యంగా బ‌దులిచ్చారు.

 

https://twitter.com/greatandhranews/status/957862294318272512

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -