Monday, May 20, 2024
- Advertisement -

బాలయ్యతో కలిసి ఫిబ్రవరిలో నాని..!

- Advertisement -

‘భలే భలే మగాడివోయ్’ సినిమా హిట్ తో మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నాని లేటేస్ట్ సినిమా ‘జై బాలయ్య’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాని.

ఈ సినిమాకి ‘అందాల రాక్షసి’ ఫేమ్ హనూ రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని బాలయ్య అభిమానిగా నటిస్తున్నారట. ఈ సినిమా ఆడియో ని జనవరి 10 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాని మాత్రం  ఫిబ్రవరి 5 రిలీజ్ చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారు. 

రామ్ ఆచంట, గోపి ఆచంట,మరియు అనిల్ సుంకరలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మంచి హిట్ జోష్ మీద ఉన్నా నానికి ఈ సినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -