Wednesday, April 24, 2024
- Advertisement -

సూటు కాని పనిని తలకెత్తుకుంటున్న నాని

- Advertisement -

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని తన తొలి చిత్రం అష్టా చెమ్మా చేసాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకి జెంటిల్ మాన్ అనే ఇంకో సినిమా లో కూడా నటించాడు నాని. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీ అనే ఒక నూతన చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. ఈ సినిమా లో నాని తో పాటు సుధీర్ బాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ సినిమా లో నాని ఒక విలన్ గా కనిపించనున్నాడు. హీరో గా మంచి గా సాగుతున్న తరుణం లో ఛాలెంజింగ్ గా ఉండాలి అనే ఉదేశ్యం తో ఈ సినిమా ని ఒప్పుకున్నాడు నాని. అయితే ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా లో నాని ఆరు పలకల దేహం తో కనిపించనున్నాడట.

సిక్స్ పాక్ అంటే అందరికీ సూటు కాదు. నాని ఇప్పటి వరకు చేసిన పాత్రలు అన్నీ గమనిస్తే మనకి నాని కి సిక్స్ పాక్ సూట్ అవుతుంది అని అనిపించదు. కానీ నాని మాత్రం ఈ సినిమా లో నటిస్తున్న సుధీర్ బాబు కి ధీటుగా ఉండాలి అనే ఉదేశ్యం తో తెగ కసరత్తులు చేస్తున్నాడట.

పాత్ర కి నిజం గా అవసరం అయ్యి చేస్తే ఓకే కానీ స్క్రీన్ మీద బాగా కనిపించాలనే ఉదేశ్యం తో చేస్తే మాత్రం అది అంత మంచిగా ఉండదు అని చాలా మంది వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -