Thursday, May 2, 2024
- Advertisement -

ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తున్న స్టార్ హీరోయిన్?

- Advertisement -

నిత్య మీనన్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తను చేసే ప్రతి సినిమా అన్ని వర్గాల వారినీ అలరించే విధం గా నే ఉండాలి అనే ఉద్దేశ్యం తో నిత్య మీనన్ కష్టపడుతూ మంచి మంచి పాత్రలని ఎంపిక చేసుకుంటూ ఈ స్టేజ్ కి వచ్చింది. అయితే ఇటీవలే ఆమె ఒక ఆశ్రమానికి రహస్యం గా వెళ్లింది అనే వార్తలు ఎక్కువ అయ్యాయి. అయితే నిత్య ఆధ్యాత్మిక చింతన వైపు ఆసక్తి కనబరుస్తుంది అని చాలా మంది అంటున్నా నిత్య మాత్రం దానిని అంగీకరించడం లేదు.

ఈ ఆశ్రమ సందర్శన వెనుక గల కారణాన్ని నిత్య వివరిస్తూ, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నట్టు చెప్పింది. “నేను ఆధ్యాత్మికత వైపు కి లీనం కాలేదు. నేను ఆశ్రమానికి వెళ్ళేది ఒక మతం గురించి తెలుసుకోవడానికి కాదు. మనకి చాలా విషయాల పైన అవగాహన తీసుకొని రావడానికి యూనివర్సిటీ లు ఎలాగో ఉన్నాయి. కానీ మనుషుల గురించి మనుషులకి తెలియపరచడానికి మాత్రం ఆశ్రమమే కరెక్ట్. ఈ విషయం కూడా నేను ఆశ్రమం లో విశ్రమించినప్పుడు తెలుసుకున్నాను.” అని చెప్పింది.

నిత్య మీనన్ ప్రస్తుతం తెలుగు లో పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ ఇతర భాషల్లో మాత్రం మంచి సినిమాలని సైన్ చేసింది. అందులో జయలలిత బయోపిక్ కూడా ఒకటి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -