Wednesday, April 24, 2024
- Advertisement -

నాని ‘టక్ జగదీష్’ లేటెస్ట్ అప్ డేట్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అష్టచమ్మ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన నాని తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివొయ్ చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన నాని అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రీసెంట్ గా ‘వి’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తాజాగా నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానికి సరసన నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సాహుగారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో వెలుగు వెలుగుతున్న తమన్ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిటీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో నాని ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌నంత క్లాస్‌లుక్‌తో స‌రికొత్తగా కనిపిస్తున్నారు.

కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతోన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంటే తెలుగు సంవత్సరాది ఉగాది (ఏప్రిల్‌ 13) పండుగ తర్వాత 3 రోజులకు ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ‘

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -