Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీరెడ్డి ఇష్యూపై రెచ్చిపోయిన నాని భార్య‌!

- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నానిపై గత కొద్దిరోజులుగా శ్రీరెడ్డి వివాదస్పద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులు నాని ఈ ఇష్యూపై స్పందించ‌లేదు.దీంతో ఇంకా రెచ్చిపోయిన శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్‌లో నానిపై వివాస్ప‌ద కామెంట్స్ చేస్తుంది.నాని త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి లైంగికంగా వాడుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

బిగ్‌బాస్‌లో నన్ను తీసుకుకోకుండా నాని అడ్డుకున్నాడ‌ని,మీరు అనుకున్నంత మంచివాడు కాద‌ని త్వ‌ర‌లోనే నాని గురించి మొత్తం బ‌య‌టపెడతానంటు హెచ్చ‌రించింది.దీంతో నాని తాజాగా దీనిపై నాని స్పందించాడు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్‌ నోటీసులు పంపించారు. అయితే ఈ వివాదంపై నాని భార్య అంజనా సైతం స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది.

అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’ అని అంజ‌నా ట్వీట్ చేశారు.మ‌రి దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇప్పటికే నాని నోటీసులకు తాను సిద్దమని శ్రీరెడ్డి స్పష్టం చేసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -