Friday, March 29, 2024
- Advertisement -

ప‌గ తీర్చుకోడానికే గ్యాంగ్‌లీడ‌ర్‌గా రాబోతున్న నాని

- Advertisement -

‘జెర్సీ’ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు తన తదుపరి సినిమా ‘గ్యాంగ్ లీడర్’ తో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మీ మరియు శరణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్ల హడావిడి మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు ఈ నేపథ్యంలో ఇవాళ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో నాని పెన్సిల్ పార్థసారధి గా కనిపించబోతున్నాడు.

రివెంజ్ రైటర్ గా పనిచేసే పార్థసారథి ఒకరోజు ఐదుగురు ఆడవాళ్ళని కలుస్తాడు. ఈ చిత్ర టీజర్ వారి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలను చూపించగా అందులో ఇకనుంచి “రిలేషన్షిప్ డ్రామాలొద్దు ఓన్లీ పగ పగ” అంటూ నాని హీరోయిన్ తో చెప్పే సన్నివేశం మరియు ఐదుగురు ఆడవాళ్లు మరియు నాని సన్ గ్లాసెస్తో నడవడం వంటి కామెడీ సీన్లు బాగున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -