Sunday, May 5, 2024
- Advertisement -

కృష్ణార్జునయుద్ధం టీజర్: నానీ బిల్డప్పులు, మాస్ ఇంట్రెస్ట్స్ కోసం సినిమా చూడాలా?

- Advertisement -

ప్రపంచ సినిమాలన్నీ కళ్ళముందుకు వచ్చాక ప్రేక్షకుల ఆసక్తుల్లో చాలానే మార్పులు వచ్చాయి. కొత్తదనం అయితే కచ్చితంగా కోరుకుంటున్నారు. కానీ మన హీరోల ఆసక్తులు మాత్రం పూర్తిగా పాత స్టైల్‌లోనే ఉంటున్నాయి. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసి ప్రేక్షకులను మెప్పించాలన్న ఆలోచన లేదు. జోనర్స్ మార్చడం అంటే కూడా ఒక మాస్ సినిమా, ఒక క్లాస్ సినిమా అనే స్టైల్‌లో వరుసగా సినిమాలు చేసుకుంటూపోతారు. స్టార్ హీరోలు ఎలాగూ ఇవే వేషాలు వెయ్యాలి. కానీ నానీలాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా పరమ రొటీన్ మాస్ ఏషాలు ఏస్తానంటేనే ప్రేక్షకులకు మొహం మొత్తుతుంది. గతంలో ఇలాంటి ప్రయత్నాలతోనే గట్టి దెబ్బలు తిన్నాడు నానీ. ఇప్పుడు మరోసారి అలాంటి సెటప్‌తో వచ్చాడు.

జెండాపై కపిరాజు సినిమా గుర్తున్నవారికి కృష్ణార్జునయుద్ధంలో నానీ కొత్తగా ఏం చేశాడా అన్న అనుమానం వస్తుంది. నానీ స్టైలిష్ అవతార్ కూడా జెంటిల్‌మేన్ సినిమాలో చూసేశారు. అందుకేనేమో నానీ కూడా రెండు క్యారెక్టర్స్‌ని ఎంచుకున్నాడు. అయితే టీజర్ మొత్తం కూడా నా యాక్టింగ్ చూడండి…..నా కోసం సినిమాకు రండి అని స్టార్ హీరోల టీజర్స్ ఉన్నట్టుగానే నానీ లాంటి టాలెంటెడ్ నటుడి టీజర్ ఉండడం మాత్రం సినిమా లవర్స్‌ని నిరుత్సాహపరుస్తోంది. టీజర్‌లో ఎక్కడా కూడా కథకు సంబంధించిన హింట్ కూడా లేదు. ఇద్దరు నానీలు……వాళ్ళ వేషాలు చూపించడంతోనే సరిపోయింది. అందులో కూడా అస్సలు సీరియస్‌నెస్ లేదు. అంతా కూడా కామెడీ కామెడీగా చూపించేశారు. ఎక్కడా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్థాయి షాట్ కూడా ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే టీజర్ బాగుంది అని అస్సలు చెప్పలేం. మాస్ హీరోయిజాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు, ఏదైనా సరే కామెడీ ఉంటే చాలు….అని ఆలోచించే ప్రేక్షకులకు నచ్చొచ్చేమో కానీ కృష్ణార్జునయుద్ధం విషయం ఉన్న సినిమా అని ప్రేక్షకులకు అనిపించే స్థాయిలో అయితే టీజర్ లేదు. ఇక నానీ కూడా తనకు అలవాటైన స్టైల్‌లో చేసుకుంటూ పోయాడు.

https://www.youtube.com/watch?v=pdfyHCkKa_8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -