Monday, May 20, 2024
- Advertisement -

బాలీవుడ్ త‌ర్వాత టాలీవుడ్‌కు క్రేజీ స్టార్‌

- Advertisement -

ఒక్కచూపుతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు వివిధ భాష‌ల్లో సినీ అవ‌కాశాలు మెండుగా వ‌స్తున్నాయి. ‘ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళీ సినిమాలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు క‌నుసైగ‌ల‌తో స్టార్‌గా మారింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్ హీరోగా నటిస్తున్న ‘సింబా’ సినిమాలో హీరోయిన్‌గా ప్రియను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్’ సినిమాకు ఇది రీమేక్‌గా తీస్తున్నారు. ద‌ర్శ‌కుడు రోహిత్‌ శెట్టి తీస్తున్న ఈ సినిమాలో రణ్‌వీర్ ప‌క్క‌న ఆలియా భట్‌, శ్రద్ధా కపూర్‌ల‌ను అనుకున్నారు. కానీ త‌ర్వాత ఇప్పుడు ప్రియ ప్రకాశ్‌ను న‌టించ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా డిసెంబర్ 28వ తేదీన విడుద‌ల చేయాల‌ని ఇప్పుడే ప్లాన్ వేశారు.అయితే ప్రియ‌ నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా మార్చి 1వ తేదీన విడుదల కావాల్సి ఉండ‌గా వాయిదా ప‌డింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -