Thursday, April 18, 2024
- Advertisement -

దీపావళికి “శ్యామ్ సింగ రాయ్”…?

- Advertisement -

“అష్టాచ‌మ్మా” అంటూ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత విభిన్న‌మైన క‌థ‌లు.. అద్భుత‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు నాని. త‌న‌దైన స్ట‌యిల్ లో న‌టిస్తూ నాచుర‌ల్ స్టార్ గా మ‌స్తు క్రేజ్ సంపాదించుకున్నాడు. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు.

ఇక తాజాగా నాని న‌టిస్తున్న మ‌రో చిత్రం “శ్యామ్ సింగ‌రాయ్”, నాని – రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా రూపొందింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం విభిన్నమైన కథతో మనముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకరం అక్టోబర్ చివరివారంలోగానీ, దీపావళికి గాని ఈ చిత్రంను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి మరియు మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జిషు సేన్ గుప్తా, మురళీశర్మ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -