కొత్త లగ్జరీ కారు కొన్న రామ్ చ‌ర‌ణ్‌.. ధరెంతంటే..!

- Advertisement -

కొత్తరకం కారు మార్కేట్లోకి వచ్చిదంటే చాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొనేయడంలో కొందరు టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ మధ్యే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ ‘లంబోర్ఘిని’ ఊరూస్‌ మోడల్‌ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా మరో న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్నాడట. ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ కారు డెలివరి కావడంతో చరణ్‌ దాన్ని హ్యండోవర్‌ చేసుకున్నాడు. అనంతరం తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఓపెన్‌ చేసి తన కొత్త బ్లాక్‌ కలర్‌ బెంజ్‌ కారులోనే చరణ్‌ ఇంటికి బయలుదేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ట్రక్‌ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -