Sunday, May 19, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో..గుండేపై చప్పట్లు!

- Advertisement -

సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో విడుదలై 10రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్స్‌ను హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఈ సక్సెస్ మీట్‍లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు మొదట సుకుమార్ ఈ కథ చేప్పిన వేంటనే ఓకే అనేశాను.

అంతా బాగా నాకు ఈ సినిమా కథ నచ్చింది. ఈ సినిమా నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సినిమాని తెరకేక్కించాడు. నా 25వ చిత్రం నాకు మంచి అనందనిచ్చింది. మంచి సినిమా తీశాం అందరు ఈ సినిమాని చాలా బాగా అదరిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో సినిమాని మరో మెట్టుకు తీసుకేల్లాడు.

అలాగే జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు మంచి సపోర్టు ఇచ్చి ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు అని తెలిపాడు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో వచ్చే ఓ సీన్ అదేనండి కుడి చేతిని గుండెకు తగిలించి, చప్పట్లు కొట్టె సీన్ ను అందరు స్టేజ్‍ పై ఒక్కసారిగా చేసారు.

ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, ఈ సినిమా నిర్మాత బివిఎన్‍ఎస్ ప్రసాద్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.

{youtube}v=KcCEeZaoAVc{/Youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -