Monday, May 13, 2024
- Advertisement -

సత్తాచాటాడు… ఎన్టీఆర్ కూడా ఆ పోటీలోకి దూకాడు!

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’ ఎక్కువశాతం విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటోంది ఈ సినిమా.

అందులోనూ ఎన్టీఆర్ కు సరైన హిట్లు లేకపోవడంతో ఈ సినిమాతో ఆ కరువు తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నాడు. మరి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు కొన్ని పాజిటివ్ సైన్స్ కూడా లభిస్తుండటం విశేషం. 

తాజా విషయం ఏమిటంటే… “నాన్నకు ప్రేమతో” సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయినట్టుగా తెలుస్తోంది. జెమినీ టీవీ వాళ్లు మంచి ధర పెట్టి ఈ సినిమా ప్రసార హక్కులను కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇతర హీరోల సినిమాలు అన్నీ భారీ మొత్తాలకు అమ్ముడవుతుంటే.. ప్రసారహక్కుల విషయంలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా పోటీలోకి దిగినట్టు అవుతోంది.

ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చిత్రాలేవీ అమ్ముడవ్వని రీతిలో ఈ సినిమా ప్రసార హక్కులు అమ్ముడయినట్టుగా తెలుస్తోంది. మరి విడుదలకు ముందే ఈ సినిమా ఇలాంటి వార్తల్లోకి వస్తోందంటే.. విడుదల తర్వాత ఎన్టీఆర్, ఆయన అభిమానుల కరువు తీరుస్తుందేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -