కల్కి సినిమా హిట్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.సినిమాకు మంచి రివ్య్వూలు రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఎక్స్ ద్వారా వెల్లడించారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకువెళ్లినందుకు చిత్ర నిర్మాతలను అభినందించారు. సినిమా హిట్టైనందుకు ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దర్శకుడు నాగ్ అశ్విన్‌లకు అభినందనలు తెలియజేశారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
