Saturday, May 18, 2024
- Advertisement -

విరామమా?? విరమణా??

- Advertisement -

తన కెరీర్ ఆరంభం లోనే మంచి చిత్రాలు చేస్తాడు అనే పేరు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. బాణం సినిమా తో హీరో గా అరంగేట్రం చేసినా, ఆ తర్వాత పెద్దగా విజయాలు అందుకోలేకపోయారు కానీ నటుడిగా మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు రోహిత్. తన కెరీర్ లో స్వయం గా తన కష్టం తో ఎదిగిన రోహిత్ ఎంతో మంది కరీర్స్ ని కూడా సెట్ చేసాడు. అయితే ఇప్పుడు మాత్రం రోహిత్ సినిమాలకి దూరం అయ్యాడు.కాకపోతే అది విరామమా? లేక విరమణ నా అనే విషయం మీద మాత్రం అసలు క్లారిటీ లేదు.

నారా రోహిత్ చివరిగా నటించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’ ఈ సినిమా విడుదల అయినా తోలి రోజే పెద్ద ఫ్లాప్ అయింది. అయితే ఆ సినిమా విడుదల అయ్యి కూడా చాలా రోజులే అయ్యింది.ఇప్పటి కూడా రోహిత్ ఇంకో కొత్త సినిమా ని ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ పది నెలల నుండి రోహిత్ ఖాళీ గా నే ఉన్నాడు. మధ్యలో ఒక రెండు సినిమాలని ప్రకటించారు కానీ అవి ఆగిపోయినట్టు తెలుస్తుంది.

ఇవన్నీ పక్కన పెడితే ఇక రోహిత్ తన మొదటి సినిమా బాణం తీసిన చైతన్య తో మళ్ళీ పని చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి కానీ అందులో కూడా ఎంత నిజం ఉంది అని తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -