సినిమాల విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లడం సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అలవాటు. ఓ వారం రోజుల పాటు హిమాలయాల్లో గడుపుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ధాన్యం చేస్తూ సాధారణ మనిషిలా గడపడం రజనీ చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రజనీ నటించిన ‘కాలా’ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో తన అలవాటును రజనీకాంత్ కొనసాగిస్తున్నారు. హిమాలయాల్లో గడపడానికి రజనీకాంత్ మార్చి 10వ తేదీన బయల్దేరి వెళ్లిపోయారు. ప్రశాంతత కోసం ప్రతీ ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా హిమాలయాకు వెళ్లారు. అక్కడే కొన్ని రోజులు గడిపి తిరిగి తమిళనాడుకు రానున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ రాజకీయాలతో పాటు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.
కాలా కొన్ని రోజుల్లో విడుదల అవుతుండగా మరోవైపు 2.0 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ అనే దర్శకుడితో రజనీకాంత్ నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో కొన్నిరోజులు ఉండి.. ధ్యానం చేసుకుని వచ్చాక జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే హిమాలయాల్లో కొంత స్థలం కూడా కొని రజినీ అక్కడి సాధువులకు సొంతంగా ఓ ఆశ్రమం కడుతున్నాడు.
