Sunday, May 19, 2024
- Advertisement -

నరుడా డోనరుడా మూవీ రివ్యూ

- Advertisement -
naruda donaruda movie review

‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే చిత్రం తర్వాత చాలా టైం తీసుకొని సుమంత్, బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే చిత్రంను నరుడా డోనరుడా అంటూ రీమేక్ చేశారు. ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ :

విక్కీ (సుమంత్) ఏ పనీ లేకుండా అల్లరిచిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విక్కీని, ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) అనే ఓ ఇన్‌ఫెర్టిలిటీ సంబంధిత డాక్టర్ కలిసి వీర్య కణాలను (స్పెర్మ్) దానం చేయమని కోరతాడు. విక్కీకి ఉన్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి అతడి వీర్యకణాలు పవర్‌ఫుల్ అని విక్కీని ఈ పనికి ఒప్పిస్తాడు. వీర్యదానాన్నే తన పనిగా మార్చుకొని విక్కీ బాగా సంపాదించడమే కాక, ఆషీమా (పల్లవి సుభాష్) అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత తనకు పిల్లలు పుట్టరని తెలిసాక, విక్కీ చేసే పని గురించి ఆషీమాకు తెలుస్తుంది. ఇలాంటి పనిచేసే వాడితో ఎలా ఉండాలంటూ విక్కీతో ఆషిమా విడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్కీ ఎంచుకున్న మార్గం అతడికి ఏయే ఇబ్బందులు తెచ్చిపెట్టింది? చివరకు వీరిద్దరి కథ ఎక్కడికి చేరిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంకు కథ  మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. వీర్యదానం చేసే ఓ కుర్రాడిని అతడు ప్రేమించే అమ్మాయితో సహా, మిగతా ప్రపంచమంతా ఎలా చూస్తుందన్న కోణంలో స్టోరీ చూపించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ పరవలేదు అనిపించేలా ఉంది. ఇక ప్రధాన పాత్రలన్నింటి బ్యాక్‌స్టోరీ బాగుంది. ఎమోషనల్‍గా సాగే క్లైమాక్స్ కూడా సినిమాకు బలాన్నిచ్చేదిగా చెప్పుకోవచ్చు. తనికెళ్ళ భరణి ఈ చిత్రంకు ప్రాణం లాంటివారని చెప్పాలి. ఒక బలమైన పాత్రలో ఆయన తనదైన టైమింగ్ ఉన్న నటనతో, డైలాగ్ డెలివరీతో కట్టిపడేశారు. ముఖ్యంగా సుమంత్‌తో విత్తనం అనేప్పుడల్లా తనికెళ్ళ భరణి టైమింగ్ అదిరిపోయేలా ఉంది. హీరో సుమంత్ తన పరిధిమేర బాగా నటించాడు. నటి శ్రీలక్ష్మి చాలారోజుల తర్వాత ఒక మంచి పాత్రలో తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌లో కామెడీ తో ఎంటర్‌టైనింగ్ చేసిన సెకండాఫ్‌లో మొదలయ్యే అసలైన ఎమోషన్‌ను మాత్రం బాగా చూపలేకపోయారు. హీరో-హీరోయిన్ల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ హడావుడిగా ముగించేసి అసలు ఎమోషన్‌ను అందుకోలేకపోయారు. ఇక హీరోయిన్ పల్లవి సుభాష్ తన పాత్రకు న్యాయం చేయలేకపోవడం కూడా ఓ మైనస్‌గా చెప్పుకోవాలి. సినిమా అంతా అవసరానికి మించి లౌడ్‌గా ఉండడం కూడా కాస్త విసుగు తెప్పించింది.

మొత్తంగా:

ఈ నరుడా డోనరుడా సినిమా ఇప్పుడు వస్తున్న సినిమాలో కొత్త కథతో వచ్చిన సినిమాయే. అయితే ఆ కొత్తదనమున్న కథలోని ఎమోషన్స్‌ను సరిగ్గా పండించలేకపోవడమే ఈ సినిమాలో మైనస్. . తనికెళ్ళి భరణి అదిరిపోయే నటన, కామెడీ, సుమంత్ ప్రెజెన్స్, ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఫస్టాఫ్‌ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌ బలంగా లేకపోవడం నిరాశపరిచే అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే… కథ బాగానే ఉన్న అది చూపించడంలో విఫలం అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -