Thursday, May 2, 2024
- Advertisement -

చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా..?

- Advertisement -
winter foot care tips

చలికాలం.. అదేనండి వింటర్  వచ్చేసింది. డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా ఈ కాలంలో త్వరగా పగిలిపోతుంది. మరీ ముఖ్యంగా పాదాలు. కొంతమందికైతే నడవడానికి కూడా ఇబ్బంది కరంగా తయారౌతాయి ఆ పాదాలు. మరి సెల్యూషన్ ఎలా.. ?

చాలా ఈజీ అండీ..  

1.    అరటిపండు పేస్ట్ ను పాదాల పగుళ్ళ పై రాసి పది నిముషాలు వుంచి తరువాత నీటితో కడిగేస్తే బిరుసెక్కిన స్కిన్ పోయి పాదాలు  మెత్తబడతాయి.

2.   కొద్దిగా ఆలివ్ ఆయిల్ లో  నాలుగు చెంచాల ఓట్స్ మిల్క్ కలిపి పాదాలకు మర్దన చేసుకుని, ఒక అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే  పాదాల పగుళ్లు తగ్గి  మృదువుగా తయారవుతాయి.

3.   గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలు మునిగేలా వుంచాలి. పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది. అలాగే రోజ్ వాటర్, గ్లిజరిన్ సమానంగా తీసుకుని పగిలిన చోట రాస్తూ ఉంటే పగుళ్ల నొప్పి తగ్గటంతో పాటు పగుళ్ళు కూడా మాయమవుతాయి. 

4.   బాగా పండిన బొప్పాయి గుజ్జులో  కొంచెం నిమ్మరసం కలిపి కాళ్ళకు మర్దన చేయడం వలన పగుళ్ళు తగ్గడంతో పాటు స్మూత్ గా ఉంటాయి. 

సో.. ఫ్రెండ్స్ పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ  మెత్తని స్లిప్పర్స్‌ కూడా వాడండి.. మంచి ప్రయోజనాలను పొందండి.

Related

  1. వామ్మో.. సబ్బు!!!
  2. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!
  3. బిత్తిరి సత్తి కి సొంత ఊరిలో సన్నానం!
  4. యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -