Friday, May 3, 2024
- Advertisement -

కిరీటిపై నాని ఫైర్‌!

- Advertisement -

బిగ్‌బాస్‌-2 లో నాని రెచ్చిపోతున్నాడు.ప్రేక్షకులకు కావల్సిన అసలు సిసలు మజాను అందిస్తున్నాడు నాని. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్‌గా నాని ఆకట్టుకున్నాడు. గత రెండు వారాల్లో కనిపించిన నాని కన్నా ఈ ఎపిసోడ్‌లో భిన్నంగా కనిపించాడు. . ఇక శుక్రవారం హౌస్‌లో చోటుచేసుకున్న వ్యవహారాలపైనే ఈ ఎపిసోడ్‌ అంతా చర్చ జరిగింది. ముఖ్యంగా కిరిటీ దామరాజు, కౌశల్‌ పట్ల వ్యవహరించిన తీరును నాని తప్పుబట్టాడు.కిరీటి దామరాజు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని, తోటి కంటెస్టెంట్‌లను సైతం హెచ్చరించాడు.

కెప్టెన్‌ టాస్క్‌లో భాగంగా చేతులు కట్టేసిన కౌశల్‌ ముందు నిమ్మరసంతో బాధపట్టే ప్రయత్నంలో మాటలతో రెచ్చగొట్టడం, అమ్మాయిల తరఫున మాట్లాడుతూ,తన ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం మగతనమా అని ఘాటుగా ప్రశ్నించాడు నాని .దానికి సంబంధించిన వీడియోలను చూపించాడు. అంతేకాకుండా కిరిటీ ఎలిమినేషన్‌ ప్రకియలో ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా తిరస్కరించేవారని, అంతలా ప్రేక్షకులకు వ్యతిరేకిస్తున్నారని కూడా హెచ్చరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -