Monday, May 6, 2024
- Advertisement -

వైఎసార్సీపి నుంచి అన్నా రాంబాబుకి తీవ్ర వ్యతిరేకత..

- Advertisement -

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే వైఎసార్సీపి ప్రకాశం జిల్లా ప్రెసిండెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డిలను కలిసి తను పార్టీలో చేరేందుకు సిద్ధమని అంగీకారం తెలిపారు. అయితే టికెట్ విషయంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదే తుది నిర్ణయమని వారు చెప్పారట. అసలు మీకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా అని బాలినేని ప్రశ్నించినట్టు సమాచారం. ఒక కేసు విషయంలో అన్నా రాంబాబుకు మార్కాపురం కోర్ట్ మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. దీని పైన రాంబాబుని ప్రశ్నించినట్టు వినికిడి.

అన్నా రాంబాబుకి వైఎసార్సీపి నాయకులు, కార్యకర్తల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది . చాలా మంది గిద్దలూరు నాయకులు బాలినేని, వైవి సుబ్బారెడ్డిలకు ఫోన్ చేసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారట. అన్నా రాంబాబు గతంలో పిఆర్పి టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ వెళ్ళినప్పుడు, టిడిపిలో ఉన్నప్పుడు చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపణలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నాయకులని నోటికొచ్చినట్టు తిట్టేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. నన్ను ఓడించిన మీ పై కక్ష సాధిస్తానని బెదిరించిన వ్యక్తిని ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని ఇద్దరు జిల్లా నాయకులను ప్రశ్నించినట్టు తెలిసింది. వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే దాకా వెళ్లిందట.

ప్రకాశం జిల్లా రాజకీయాలలో విన్పిస్తున్న దాని ప్రకారం అన్నా రాంబాబుకి వైఎసార్సీపి నుండి ఎటువంటి హామీ దొరకలేదట. అందుకే వెంటనే పార్టీలో చేరకుండా ఒక నెల గడువు కోరారని చర్చ జరుగుతోంది.

ఒకవైపు జైలు శిక్ష, మరోవైపు వైఎసార్సీపి కార్యకర్తల నుండి వ్యతిరేకత మధ్య ఒత్తిడిలో ఉన్న అన్నా రాంబాబు రాజకీయ పయనం ఏ దిశగా మళ్లుతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -