Friday, April 26, 2024
- Advertisement -

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

- Advertisement -

‘మనం’, ’24’ వంటి విభిన్న కథలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు నాని హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నాని చేతిలో బైనాకులర్స్ తో కనిపించగా అతని వెనుక ఐదుగురు వేరే వేరే ఏజ్ గ్రూప్ కి సంబంధించిన చెందిన ఆడవాళ్లు ఉన్నారు. అందులో లక్ష్మి, శరణ్య పొంవణ్ణన్ మరియు సినిమాలోని హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. త్వరలోనే చిత్రబృందం టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 30 న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని ఈ సినిమాతో నాని కచ్చితంగా మరొక సూపర్ హిట్ ను నమోదు చేసుకుంటాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -