Thursday, May 16, 2024
- Advertisement -

కోహ్లీకి బిగ్ షాక్ ఇవ్వ‌నున్న బీసీసీఐ…..వ‌న్డే కెప్టెన్సీ ప‌గ్గాలు రోహిత్‌కు..?

- Advertisement -

సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతుల్లో టీమిండియా ఓడిపోవ‌డంతో జ‌ట్టుప్ర‌క్షాల‌న‌పై పూర్తి దృష్టి సారించింది బీసీసీఐ. ప్ర‌ధానంగా కోచ్ ర‌విశాస్త్రి, కోహ్లీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌, కోహ్లీల మ‌ధ్య విబేధాలు కూడా ఓట‌మికి కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను బీసీసీఐ సీరియ‌స్‌గా తీసుకుంది. జట్టులో సంస్కరణల దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడుగులు వేయబోతోంది. ముందుగా కెప్టెన్ కోహ్లీపైనె వేటు వేయ‌నుంది.

ముందుగా కోహ్లీని కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ ప‌గ్గాలు ఇవ్వాల‌నె వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్ ఈ తరహాలోనే ఇద్దరు కెప్టెన్లతో అద్భుత విజయాల్ని అందుకుంటోంది.మహేంద్రసింగ్ ధోనీ నుంచి 2014 చివర్లో టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల్ని కూడా స్వీకరించాడు. టెస్ట్‌, వ‌న్డే, టీ20 మూడు ఫార్మాట్‌ల‌కు కోహ్లీనె కెప్టెన్‌గా ఉండ‌టంతో స‌భ్యుల మ‌ధ్య ఆధిప‌త్య దోర‌ణి ప‌తాక‌స్థాయికి చేరింద‌నె ఆరోప‌ణ‌లు వినిపించాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏకపక్ష నిర్ణయాలతో టీమ్‌లోని సీనియర్ ఆటగాళ్లు కొందరు అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రక్షాళన దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. వన్డే జట్టు పగ్గాలని రోహిత్ శర్మకి అప్పగించాలనే ప్రతిపాదనపై బీసీసీఐలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. టెస్టులు, టీ20లకి మాత్రమే కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -