Friday, April 26, 2024
- Advertisement -

జెర్సీ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌ ..!

- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. నాని గత రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ తన పాత పంథాకే వచ్చేశాడు. నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా జెర్సీ. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రను నాని పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్‌ నటిస్తుంది. ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అప్‌డేట్స్‌ ఈ వారంలోనే ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు. సినిమాను అయితే ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయిన నాని హిట్‌ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే విక్రమ్‌ కూమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం కూడా అయింది. ఈ సినిమాకు గ్యాంగ్‌ లీడర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -