Thursday, April 25, 2024
- Advertisement -

పోస్ట‌ర్ల‌తో అ!ద‌ర‌గొడుతున్న నాని

- Advertisement -

సినిమాలు విజ‌య‌వంతంగా చేసుకుంటూ పోతూనే నిర్మాణ రంగంలోకి న్యాచురల్‌ స్టార్‌ నాని అడుగుపెట్టాడు. తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘అ’!. చిన్న సినిమాగా చెబుతున్నా పెద్ద న‌టీన‌టుల‌ను పెట్టుకొని రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల‌తో సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు నాని. ఈ సినిమాలో రెజీనా, రవితేజ, నిత్యామేనన్‌, అవసరాల శ్రీనివాస్‌, ప్రియ‌ద‌ర్శ‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, ఈషారెబ్బా, ముర‌ళీశ‌ర్మ‌ త‌దిత‌రులు న‌టిస్తున్నార‌ని ప్ర‌క‌టించారు.

అయితే వీరంద‌ర్నీ పోస్ట‌ర్‌ల‌ను విభిన్నంగా రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌ల చేస్తూ ప్ర‌త్యేక‌త చాటుకుంటున్నాడు. ఈ విధంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌ను నాని చేసేస్తున్నాడు. ఈపాటికే సినిమాపై ఓ అంచ‌నా ఏర్ప‌డింది.

ఈ సినిమాలోని న‌టీన‌టుల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తూ మీడియాకు ప‌ని పెడుతున్నాడు. నిత్య‌మీనాన్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీనివాస్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శ‌న్‌, నాని, ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చే చేప‌, చెట్టు పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేశాడు. తాజాగా కాజల్ అగ‌ర్వాల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గులాబీ పువ్వును పట్టుకుని దిగాలుగా చూస్తున్న కాజల్‌ ఫొటోను వివిధ ఫ్రేమ్‌లలో చూపించారు. ఇందులో కాజ‌ల్ కాళీ పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌.

ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం చేస్తున్నాడు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నాని ప్ర‌క‌టించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -