న్యాచురల్ స్టార్ నాని ఒక సినిమా విడుదల చేసే లోపు మరో సినిమాను మొదలుపెడుతున్నాడు. నాని ప్రస్తుతం నటిస్తున్న జెర్సీ సినిమా చివరి షెడ్యుల్‌ను జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను మొదలు పెట్టాడు నాని. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన 24 సినిమాను ఇటీవలే మొదలు పెట్టాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాని – విక్రమ్ కుమార్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను పెడుతున్నారని సమాచారం. 1990లలో చిరంజీవి ఇమేజ్‌ను మరింత పెంచిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమాతో చిరంజీవి మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా పేరునే నాని తన సినిమాకు ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ రోజు నాని పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన అఫిషయల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. నాని ఈ సినిమాలో ఓ రచయిత పాత్రలో కనిపిస్తాడని సమాచారం.ఈ రచయిత జీవితం ఐదుమంది అందమైన యువతులతో ముడిపడి ఉంటుందట. ఆ లేడీస్ గ్యాంగ్ కు లీడర్ గా ఉంటాడేమో తెలీదు గానీ ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఇప్పటికే టైటిల్ ను లాక్ చేశారని సమాచారం. ఈ సినిమా తరువాత నాని మోహనగంటి ఇంద్రగంటితో తన 25వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం.
- Advertisement -
మెగాస్టార్ టైటిల్‌తో నాని కొత్త సినిమా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -