Saturday, April 27, 2024
- Advertisement -

స్టాండ్ విత్ త్రిషా…మెగాస్టార్ మద్దతు

- Advertisement -

దక్షిణాది స్టార్ హీరోయిన్‌ త్రిషకు రోజురోజుకు మద్దతు పెరిగిపోతుంది. త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. లియో సినిమాలో కీలక పాత్రలో నటించాను కానీ హీరోయిన్ త్రిషను రేప్ చేసే సన్నివేశం నాకు లేకపోవడంతో చాలా బాధపడ్డాను అని సంచలన కామెంట్స్ చేశారు మన్సూర్. దీంతో మన్సూర్‌పై తీవ్ర విమర్శలు రాగా అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి..మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.ఇలాంటి వ్యాఖ్యలు ఒక నటికి మాత్రమే కాదు.. ఏ స్త్రీని అనడానికి వీలులేదన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అని చెప్పిన చిరు..త్రిషకు అండగా నిలబడతానని ట్వీట్ చేశారు.

ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడాలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని కోరారు హిరో నితిన్. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలమైన మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసినా రాజకీయాల్లో, సినిమాల్లో ఎదిగి చూపించామని తెలిపారు. ఇక త్రిషకు మద్దతుగా ‘వి స్టాండ్ విత్ త్రిష’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే త్రిషకు మద్దతుగా ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ సైతం స్పందించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -