Sunday, May 19, 2024
- Advertisement -

నయనతార రెండు రోజుల కోసం ఏంత తీసుకుందో తెలుసా..?

- Advertisement -

నయనతార కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె తమ సినిమాలో ఉంటే.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని దర్శకనిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆమెకి ఎంత ఇచ్చి అయిన తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆమె ఏ సినిమాలో ఉంటే.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దాంతో ఆమె కోసం హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు.

దక్షిణాదిలోని మిగితా స్టార్ కథానాయికలు అందరికంటే డబుల్, అంటే నాలుగు కోట్లు తీసుకుంటోంది సినిమాకి. అయినా ఆఫర్లు తగ్గవు. సినిమా ప్రమోషన్స్ కి అస్సలు రాదు. ఒకవేళ రావాలంటే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి. అయినా ఆమె వెంటే దర్శకనిర్మాతలు. ఇక యాడ్ ప్రపంచానికి నయనతార మొదటినుంచి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తను యాడ్ చేయడం చాలా అంటే చాలా రేర్. అలాంటిది ఈమధ్య ఒక DTH సర్వీసుల బ్రాండ్ యాడ్ లో కనబడుతోంది. దాంతో అందరు ఆశ్చర్యపోయారు. నయనతారను యాడ్ కోసం ఒప్పించారంటే.. ఆ కంపెనీ తెలివితేటలు మాములుగా లేవు అనుకున్నారు. కానీ అసలు సంగతి వేరు.

ఆ బ్రాండ్ నచ్చి లేక వారి మాటలు నచ్చి ఆ యాడ్ చేయలేదు నయనతార. డబ్బు కోసమే చేసింది. అది కూడా ఎంతో తెలుసా..? ఏకంగా 5 కోట్లు అంట. కేవలం రెండురోజులు షూట్ చేసినందుకు ఆమెకు 5 కోట్లు ఇచ్చారట. అంత చిన్న షూట్ కి అంతమొత్తం.. మహేష్ బాబు, ప్రభాస్ కూడా తీసుకోలేదేమో. ఓ సినిమా చేస్తే.. నాలుగు కోట్లు ఇస్తారు. ఇక్కడ రెండు రోజులు యాడ్ చేస్తే ఐదు కోట్లు వచ్చాయి. మరి ఈ రెంజ్ ఖర్చు పెట్టి చేసిన ఆ యాడ్ కు నయనతార వల్ల ఏమైన ఉపయోగం ఉంటుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -