Sunday, April 28, 2024
- Advertisement -

ఒత్తిడిలో చంద్ర‌బాబు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక తేదీ ద‌గ్గ‌ర ప‌డేకొద్ది ప్ర‌చారం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇప్ప‌టికే ప్ర‌చారం నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగుతోంది. అయితే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా వైసీపీకే ఉన్నాయ‌ని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. టీడీపీ మాత్రం గెలుపు మీద ఆశ‌లు మాత్రం చావ‌టంలేదు. శిల్పామోహ‌న్‌రెడ్డిదే గెలుపని బాబుకు ముందే తెలుసు.
టీడీపీ ఎన్నిక ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎద‌ర‌వుతోంది. అస‌లు ప్ర‌చారంలో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి అస‌లు ఎవ‌రో తెలియ‌ద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. అభ్య‌ర్తి ఎవ‌రో తెల‌యిదంటె ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అధికారంలోకి వ‌చ్చి మూడు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు నంద్యాల‌కు ఏంచేశార‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.
మ‌రో వైసీపీ అభ్య‌ర్తి శిల్పా మోహ‌న్‌రెడ్డికంగా మంచి ప‌ట్టుందు. స్థానికంగా మ‌ద్దుతోపాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ అభిమానం పుస్క‌లంగా ఉన్నాయి. భారీగా టీడీపీనుంచి వ‌ల‌స‌లు వైసీపీకి ప్రారంభ‌మ‌య్యాయి. ఇక త‌మ్ముడు చ‌క్ర‌పాణికూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్దంగా ఉన్నారు. ప్ర‌ధానంగా టీడీపీ అభ్య‌ర్తి భూమా సొంత‌ కుటుంబంనుంచి కూడా కాక‌క‌పోవ‌డం టీడీపీకి మైన‌స్‌.
ప్ర‌చారంలో టీడీపీ అతి చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర టీడీపీ నాయ‌కులు అంద‌రూ అక్క‌డే మ‌కాంవేసి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నారు. నాన్‌లోకల్ నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారంపైకూడా స్థానికుల‌నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. హ‌డావుడిగా ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు చేస్తున్న శంఖుక‌స్తాప‌న‌లపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌డంలేదు. ఇదంతా ఎన్నిక కోస‌మేన‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అంటున్నారు.
బాబు సొంత స‌ర్వేలు,ఇత‌ర స‌ర్వేల‌ల్లో వైసీపీ అభ్య‌ర్తి గెల‌పు ఖాయంమ‌ని పలితాలు వ‌స్తున్నాయి. మ‌రో వైపు అఖిల కూడా గెలుపుపై ముందునుంచి ఉన్నా ధీమీ ఇప్పుడు లేద‌నిపిస్తోంది. ఓడిపోతె వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏవిలేవ‌ని వ్యాఖ్యానించారు. ఓడిపోతామ‌ని తెలుసుకొని కూడా బాబు ఎందుకు ఆరాట‌ప‌డుతున్నారో అర్థం కావ‌డంలేదు. క‌నీసం డిపాజిట్ కోస‌మే బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=rbWEAZ9i9o8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -