Tuesday, May 21, 2024
- Advertisement -

రెండో స్ధానంలో శృతి హాసన్..

- Advertisement -

నయనతార. దక్షిణాది హీరోయిన్. పదేళ్లుగా దక్షిణాది భాషల్లో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతున్న తార. కెరీర్ లో ఎన్ని ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు ఎదురైనా తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుని నెంబర్ వన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ఓ చర్చ వేదికలో అందరూ నయనతారే నెంబర్ 1 అని తేల్చి చెప్పారు.

ఒకవిధంగా చెప్పాలంటే నిర్మాత, దర్శకుల పాలిట కల్పతరువు కూడా నయనతారే కావడం మరో విశేషం. ఇక ఈ పోటీలో రెండో స్ధానాన్ని కైవసం చేసుకుంది కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్. ఇటీవలే సినీ రంగంలోకి వచ్చినా ఎంతో శ్రద్ధగా పని చేస్తుందనే పేరు తెచ్చుకుంది శృతి హాసన్. మూడో స్ధానంలో ఇంగ్లీషు చిన్నది ఎమీజాక్సన్, నాలుగో స్ధానంలో అనుష్క నిలిచారు.

చర్చా వేదికలో ఇక్కడే కాస్త ఇబ్బంది వచ్చింది. కొందరు అనుష్కకే మూడో స్ధానం కట్టబెడితే మరికొందరు ఎమీజాక్సన్ ను ఎంపిక చేశారు. మొత్తానికి ఎమీజాక్సన్ నే మూడో స్ధానాన్ని దక్కించుకుంది. దక్షిణాది భాషా చిత్రాల్లో కథానాయికగా వెలుగొందుతున్న తమన్నా మాత్రం ఐదో స్ధానానికి పరిమితం అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -