Tuesday, April 30, 2024
- Advertisement -

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే…

- Advertisement -

కంప్యూటర్. నిత్య జీవితంలో ప్రధానమైపోయింది. కంప్యూటర్ వాడని వారు బహుశా ఎవరూ లేరేమో. దీని వల్ల ఎన్ని లాభాలుంటాయో అన్ని నష్టాలు.. కష్టాలు ఉంటాయని మాత్రం మరచిపోవద్దు అంటున్నారు నిపుణులు. కంప్యూటర్ వల్ల అరోగ్యంపై దుష్ప్రరిణాలు ఎన్నో ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.

కంప్యూటర్ కొని తెచ్చే అనర్ధాల్లో మొట్టమొదటిది కళ్లు దెబ్బతినడం. ఎక్కువ సమయం కంప్యూటర్ తో పని చేస్తే కళ్లు సరిగా పనిచేయవట. కళ్లు మంటలు, లాగడం, నొప్పులు, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అలాగే ఎక్కవ కాలం కంప్యూటర్ తో ఉండడం వల్ల ఉబకాయం, బరువు పెరగడంతో పాటు సోమరులుగా మారతారని వారు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు రక్తపోటు, నిరాశ, మానసిక వ్యాధులు కూడా వెంటాడతాయట.

నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారిలో ఒళ్ళు నొప్పులు, మెడనొప్పులు, స్పాండిలైటిస్ వంటి వ్యాధులు అధికమవుతాయని వారంటున్నారు. కంప్యూటర్ వాడే వారిలో 45 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాధులు మరింత ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికి పరిష్కారంగా వ్యాయామం  చేయడం, కనీసం గంటసేపు నడవడం వంటివి తప్పనిసరిగా చేయాలట. అంతే కాదు వీలైనన్ని ఎక్కువ సార్లు నీటితో ముఖం కడుక్కోవాలని, ఎక్కువ సేపు కనురెప్పలు మూసి తెరవాలని చెబుతున్నారు. వీటితో పాటు కంప్యూటర్ కు వీలైంత దూరంగా ఉండాలని, మానిటర్ కళ్లకు సమానమైన దూరంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -