తమిళ ఇండస్ట్రీలో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఎవరైన ఉన్నరంటే అది ఖచ్చితంగా నయనతారనే. హీరోలకు ధీటు పారితోషకం తీసుకుంటుంది నయనతార. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది నయనతార. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఐరా సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేసింది..
ఈ సినిమా కూడా పూర్తిగా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కచ్చితంగా సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. కొన్నేళ్లుగా వరస విజయాలతో దూసుకుపోతున్న నయనతార.. ఐరా తో కూడా ఈ జైత్రయాత్ర కొనసాగిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరు సైరా,అజిత్ విశ్వాసం సినిమాల్లో నటిస్తోంది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!