Thursday, April 25, 2024
- Advertisement -

అంత తీసుకుంటోందా!

- Advertisement -

మొన్న ఇలియానా కోటి తీసుకుంటే గొప్పగా చెప్పుకున్నాం. నిన్న శృతి హాసన్ కోటిన్నరకు చేరిందంటే.. అబ్బో అనుకున్నాం. ఇప్పుడు ఆ రికార్డులన్నిటికీ చెక్ పెడుతూ.. నయనతార రేసుగుర్రంలా పరుగులు పెడుతోంది.

తమిళ్ లో అపరిచితుడు విక్రమ్ తో కొత్త సినిమాకు నయనతార సైన్ చేసిన విషయాన్ని.. ఆద్యా న్యూస్ చాలా రోజుల క్రితమే చెప్పింది. ఆ సినిమా గురించి నయనతారకు సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.

ఏదో గొడవ కారణంగా.. విక్రమ్ తో సినిమా చేయొద్దని గతంలో ఫిక్స్ అయిన నయన్.. ఇప్పుడు సడన్ గా మనసు మార్చుకుని స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఇందుకు రెమ్యూనరేషనే కారణమని తెలుస్తోంది. తనకు ఇష్టం లేకపోయినా.. అనుకోకుండా వచ్చిన భారీ ఆఫర్ ను కాదనలేకే సినిమాను ఒప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ముందు విక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేసేది లేదని స్పష్టం చేసిన నయనతార.. ఆ తర్వాత 3 కోట్ల రెమ్యునరేషన్ కు నిర్మాత ఓకే చెప్పడంతో.. సరే అందట. ఇప్పటికే శింబూ, ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమ వ్యవహారాలు నడిపి.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నయన్.. ఈ ఆఫర్ ను వదులుకోవద్దని అనుకుందట. అందుకే.. ఈ సినిమాకు ఓకే చెప్పిందని.. కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ గుసగుసలు నిజమే అయితే.. సౌత్ ఇండియాలో టాప్ రెమ్యూనరేషన్ అందుకోనున్న హీరోయిన్ గా నయనతార రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని కోలీవుడ్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -